‘గబ్బర్ సింగ్’ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. షాక్ లో పవన్ ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’.. టాలీవుడ్ లో ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో తెలిసిందే. ఈ మూవీ 2012 లో విడుదల కాగా ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్, సీన్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కనిపిస్తుంటాయి. ఇక గబ్బర్ సింగ్ మూవీలో అన్నీ ఒకెత్తు అయితే విలన్ బ్యాచ్ మరో ఎత్తు. ఈ మూవీలో విలన్లుగా నటించిన ఆర్టిస్టులు ఆ తర్వాత అనేక సినిమాల్లో ఆఫర్లు పొందారు. గబ్బర్ సింగ్ విలన్ బ్యాచ్ ఇప్పటికీ అందరికీ సుపరిచితమే. ఈ మూవీలోని విలన్లలో ఒకరైన రమేష్ కు గబ్బర్ సింగ్ రమేష్ గా గుర్తింపు పొందారు. అలాగే రీసెంట్ గా వచ్చిన పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలోనూ రమేష్ కనిపించారు. అయితే తాజాగా ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు.
విలన్ కమ్ కమెడియన్ గబ్బర్ సింగ్ రమేష్ కు ఆకస్మికంగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు తక్షణమే స్పందించి ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రమేష్ కు ఐసియూ లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆయన కోలుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నామని అపోలో వైద్య వర్గాలు వెల్లడించాయి. కమెడియన్ రమేష్ హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ కు గురికావడంతో ఇండస్ట్రీకు చెందిన పలువురు నటులు సాంకేతిక నిపుణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రమేష్ త్వరగా కోలుకోవాలని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని పవన్ కల్యాణ్ అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు.

అయితే టాలీవుడ్ కమెడియన్ ఫిష్ వెంకట్ కూడా గతంలో తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ సినిమాలో ఫిష్ వెంకట్ కీలకమైన కామెడీ విలన్ గా అలరించారు. ఆయన కూడా అనారోగ్య సమస్యలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 2002 లో ఆది సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఫిష్ వెంకట్ తన కెరీర్ దాదాపు 100 కు పైగా సినిమాల్లో నటించారు. ఆయన చివరగా 2022 లో డీజేటిల్లు సినిమాతో అలరించారు. ఇలా వరుసగా గబ్బర్ సింగ్ బ్యాచ్ విలన్ లు ప్రాణాలు కోల్పోవడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.
