- తప్పుడు ఆరోపణలు తగదు..
- సీఎంకు,ఎమ్మెల్యేకు ఉన్న చొరవతోనే మాట్లాడారు..
- ఎమ్మెల్యే పై బురదజల్లే ప్రయత్నాలే
- కౌన్సిలర్ శ్రీకాంత్
జనవాహిని ప్రతినిధి తాండూరు : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తాండూరు మున్సిపల్ పరిధిలోని పదవ వార్డ్ కౌన్సిలర్ శ్రీకాంత్ హెచ్చరించారు. అనవసరంగా లేనిపోని ఆరోపణలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కొడంగల్ లో జరిగిన సీఎం కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న వాక్యాలను కొందరు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎన్నోఏళ్ల నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, దానిపై సీఎం హాస్యాస్పదంగా చేసిన వాక్యాలను తప్పుడు ప్రచారం చేస్తూ… ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ అంటే కూడా తెలియని వాళ్ళు మనోహర్ రెడ్డి పై చేసే వ్యాఖ్యలు హాస్యాసదమన్నారు. లేనిపోని ఆరోపణలు చేసి మచ్చలేని నాయకుడిపై బురదజల్లే ప్రయత్నాలు చెయ్యరాదని ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీకాంత్ హెచ్చరించారు.