HomeNewsబుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ భూసేరణ రణరంగం.. పోలీసుల కళ్ళలో కారం చల్లి, కుర్చీలు విసిరేసి

బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ భూసేరణ రణరంగం.. పోలీసుల కళ్ళలో కారం చల్లి, కుర్చీలు విసిరేసి

బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ భూసేరణ రణరంగం.. పోలీసుల కళ్ళలో కారం చల్లి, కుర్చీలు విసిరేసి

తెలంగాణ రాష్ట్రంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్న వేళ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కారణంగా బహదూర్ గూడాలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని బహదూర్ గూడాలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ రణరంగంగా మారింది.

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం బహదూర్ గూడాలో ఉద్రిక్తత

రంగారెడ్డి జిల్లా బహదూర్ గూడాలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అయితే అక్కడ ఉన్న స్థానిక రైతులు దీనిపైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తమ భూములు బలవంతంగా లాక్కోవాలని వారు కోరారు. మార్కెట్ విలువకు అనుగుణంగా పరిహారం భూమికి బదులు భూమి వంటి అంశాల పైన ముందుగానే తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

bullet train project land acquisition process for bullet train project turned into a battlefield

భూసేకరణపై రైతులకు అధికారులకు మధ్య రగడ

ఈ డిమాండ్లతో వారు గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో నేడు ఉదయం బహదూర్ గూడలోని ప్రభుత్వ భూమికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేశారు. అయితే ఆ భూములలో పంటలు సాగు చేసుకుంటున్న రైతులు తమకు న్యాయం చేయాలని ఫెన్సింగ్ వేయడానికి వచ్చిన అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఓ దశలో ఫెన్సింగ్ వేయకుండా అడ్డుకున్నారు. అధికారుల తీరుకు నిరసనగా నినాదాలు చేశారు.

కారం చల్లి, కుర్చీలు విసిరేసిన రైతులు

ఈ క్రమంలోనే రైతులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. నరసింహ అనే రైతు స్పృహ కోల్పోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్, బిజెపి నేతలు రంగంలోకి దిగారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది ఈ క్రమంలోనే ఆందోళన చేస్తున్న వారు కొంతమంది పోలీసుల పైకి కారం చల్లి, కుర్చీలు విసిరేశారు. ఇది మరింత టెన్షన్ను పెంచింది.

దేవాదాయశాఖ అధికారులపై కారంపొడి, పెట్రోల్ తో కబ్జాదారుల ఎటాక్.. చెన్నూరులో షాకింగ్ ఘటన!
దేవాదాయశాఖ అధికారులపై కారంపొడి, పెట్రోల్ తో కబ్జాదారుల ఎటాక్.. చెన్నూరులో షాకింగ్ ఘటన!

రైతుల తీరుపై డీసీపీ యోగేష్ గౌతమ్

ఆందోళనకారులు కారం చల్లడంతో, డిసిపి యోగేష్ గౌతమ్ తో పాటు పలువురు సిఐలు కళ్ళల్లో కారంపొడి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అనంతరం రైతులకు మద్దతిస్తున్న నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైతులు తమకు సమస్య ఉంటే దానిని శాంతియుతంగా నిరసన తెలిపి పరిష్కరించుకోవాలి కానీ ఈ విధమైన చర్యలకు దిగడం సరైనది కాదని డిసిపి యోగేష్ గౌతమ్ తెలిపారు. ప్రభుత్వ భూమికి కంచె వేశాం కానీ సాగులో ఉన్న పంటలను నాశనం చేయలేదని వారన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments