జనవాహిని టీవీ, తాండూరు:- తాండూరు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త, RBOL సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR)ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా BSR కుటుంబ సభ్యులు ఎంపీకి ఘన స్వాగతం పలికి ఆత్మీయంగా ఆతిథ్యం అందించారు. అనంతరం తాండూరు ప్రాంత పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు.ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు, కొత్త పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, పెట్టుబడులను ఆకర్షించే మార్గాలు, పారిశ్రామిక విస్తరణ ద్వారా స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే అంశాలపై విస్తృతంగా అభిప్రాయాలు పంచుకున్నారు.

తాండూరును పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసి, పెట్టుబడులకు అనుకూల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వంతో పాటు పారిశ్రామికవేత్తలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడినట్లు సమాచారం.ఈ భేటీ తాండూరు పారిశ్రామికాభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేసే చర్చగా స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది.