HomeEntertainmentNational Film Awards 2026: ఉత్తమ తెలుగు చిత్రంగా 'కమిటీ కుర్రోళ్లు'.. 'పుష్ప 2', 'కల్కి'...

National Film Awards 2026: ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’.. ‘పుష్ప 2’, ‘కల్కి’ సినిమాలకు అవార్డులు


National Film Awards 2026: ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’.. ‘పుష్ప 2’, ‘కల్కి’ సినిమాలకు అవార్డులు

72వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డుల్లో 2024 సంవత్సరానికి గానూ ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లు ఎంపికైంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మెగా డాటర్ నిహారిక నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో గ్రామీణ నేపథ్యం, స్నేహం, భావోద్వేగాలు, మనుషుల మధ్య సంబంధాలను సహజంగా చూపించారు. అందుకే ఈ సినిమా అటు ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఇక ఈ అవార్డుపై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. ప్రేక్షకుల ఆదరణ, సినీ ప్రేమికుల ప్రోత్సాహమే ఈ విజయానికి కారణం అని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

ఇక ఉత్తమ తమిళ సినిమాగా ధనుష్ నటించిన రాయన్ నిలిచింది. అలాగే బెస్ట్ మలయాళ మూవీగా ‘ఫెమినిచి ఫాతిమా’, బెస్ట్ కన్నడ చిత్రంగా ‘మిథ్యా’, అలాగే బెస్ట్ హిందీ సినిమాగా ‘శ్రీకాంత్’ ఎంపికయ్యాయి. అలాగే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 చిత్రానికి గానూ రెండు అవార్డులు దక్కాయి. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా సుకుమార్ అవార్డును కైవసం చేసుకున్నారు. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు దీపాలీ నూర్, శీతల్ శర్మ పుష్ప 2 సినిమాకు గానూ దక్కింది. ఇక లక్కీ భాస్కర్ మూవీ బెస్ట్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కు గానూ పురస్కారం సొంతం చేసుకుంది.

ఇక నేషనల్ బెస్ట్ ఫిల్మ్ గా ఆర్టికల్- 370 సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించారు. ఇక ఉత్తమ నటి అవార్డు యామీ గౌతమ్(ఆర్టికల్- 370) దక్కించుకున్నారు. అలాగే కల్కి 2898 ఏడీ చిత్రం బెస్ట్ పాపులర్ ఫిల్మ్ పురస్కారం సొంతం చేసుకుంది. అలాగే నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు ఈ సారి ఇద్దరికి దక్కింది. చందు ఛాంపియన్ మూవీకి గాను కార్తీక్ ఆర్యన్ కు అలాగే భ్రమయుగం సినిమాకు గానూ మమ్ముట్టి సొంతం చేసుకున్నారు. అలాగే ఉత్తమ చిల్డ్రన్స్ మూవీగా 35 చిన్న కథ కాదు సినిమా దక్కించుకుంది.

committeekurrollu the Best Telugu Film Pushpa 2 Kalki also received 72nd National Film Awards

వీటితోపాటు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ దేవ్ పోతుల(35 చిన్న కథ కాదు) సినిమాకు గానూ దక్కించుకున్నారు. ఇక ఉత్తమ సహాయ నటి మిథ్య సినిమాకు గానూ రూపశ్రీ వర్కాడీ దక్కించుకున్నారు. అలాగే బెస్ట్ లిరిక్స్ మనోజ్ ముంతాషిర్ కు నేషనల్ అవార్డు దక్కింది. ఇక బెస్ట్ కొరియోగ్రఫీ స్త్రీ 2 సినిమాకు గానూ విజయ్ గంగూలీ అలాగే బెస్ట్ యాక్షన్ డైరెక్షన్(స్టంట్ కొరియోగ్రఫీ) కు గానూ అనల్ అరసుకు మహారాజ చిత్రానికి దక్కింది.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments