HomeNewsనేడు ముఖ్య గ్రహాల సంచారంతో ఈ రాశులవారికి లక్ అన్ లాక్ అవుతుంది!

నేడు ముఖ్య గ్రహాల సంచారంతో ఈ రాశులవారికి లక్ అన్ లాక్ అవుతుంది!

నేడు ముఖ్య గ్రహాల సంచారంతో ఈ రాశులవారికి లక్ అన్ లాక్ అవుతుంది!

వేద జ్యోతిష్య శాస్తంలో గ్రహాలసంచారం కాలానుగతంగా జరుగుతూనే ఉంటుంది. చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు మిథున రాశిలో, బుధుడు, శుక్రుడు మరియు ఇతర గ్రహాలు అనుకూల స్థానాలలో ఉండటం వలన కొన్ని రాశులవారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొన్ని రాశులవారు సానుకూల ఫలితాలను, కొన్ని రాశులవారు ప్రతికూల ఫలితాలను చూస్తారు. నేడు జులై 18 శనివారం ద్వాదశ రాశులవారి జాతకం ఎలా ఉందో చూద్దాం.

మేషరాశి

మేషరాశి జాతకులకు సానుకూల వాతావరణం ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి తొందరపాటు నిర్ణయాలు వద్దు.

today rashiphalalu Daily horoscope and planetary positions for July 18 2026 know lucky zodiacs

వృషభరాశి

వృషభ రాశి వారికి నేడు ఆర్ధికంగా అనుకూలంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. స్నేహితులతో మాట్లాడేటప్పుడు కోపం తగ్గించుకోవాలి.

మిధునరాశి

మిథున రాశి జాతకులకు గురు ఆదిత్య యోగ ప్రభావంతో సమయం బాగుంటుంది. ఉద్యోగంలో పై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. ఆస్తివివాదాలు పరిష్కారం అవుతాయి.

కర్కాటకరాశి

కర్కాటక రాశి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వర్తక, వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో లాభాలను పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.

సింహరాశి

సింహరాశి వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా సమర్ధవంతంగా అధిగమిస్తారు. నూతన పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కన్యారాశి

కన్యారాశి వారికి తోటి ఉద్యోగుల నుండి, స్నేహితుల నుండి ఆశించిన మద్దతు లభిస్తుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు మంచి జరుగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో మంచి లాభాలు వస్తాయి.

తులారాశి

సమాజంలో తులారాశి జాతకులు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. కెరీర్ పరంగానూ తులారాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి.

వృశ్చికరాశి

వృశ్చిక రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలు చేసేవారు బదిలీలు ప్రమోషన్ల విషయంలో సానుకూల వార్తలు వింటారు. వీరికి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి జాతకులు నేడు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఓపికతో పనిచేస్తే ధనుస్సు రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు.

జులై 19 నుండి శని మంగళ యోగం: ఈ రాశులవారు సంపన్నులవుతారు!
జులై 19 నుండి శని మంగళ యోగం: ఈ రాశులవారు సంపన్నులవుతారు!

మకర రాశి

మకర రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం. జీవిత భాగస్వామితో ఉన్న విబేధాలు తొలగిపోతాయి. ఇది మకర రాశి వారికి సానుకూలంగా ఉండే రోజు.

కుంభరాశి

కుంభ రాశి వారికి నేడు కలిసి వస్తుంది. చట్టపరమైన సమస్యలు, కోర్టు వ్యవహారాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. శత్రువుల పైన విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మీనరాశి

మీన రాశి వారికి సంతానం ద్వారా సానుకూలమైన వార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. కళాకారులు, సృజనాత్మక రంగాల వారికి మంచి గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments