HomeEntertainmentక్యాన్సర్‌తో పోరాడుతున్న వెంకటేష్ సోదరి.. హాస్పిటల్ బెడ్‌పై పిక్స్ వైరల్ !!

క్యాన్సర్‌తో పోరాడుతున్న వెంకటేష్ సోదరి.. హాస్పిటల్ బెడ్‌పై పిక్స్ వైరల్ !!


క్యాన్సర్‌తో పోరాడుతున్న వెంకటేష్ సోదరి.. హాస్పిటల్ బెడ్‌పై పిక్స్ వైరల్ !!

ప్రముఖ నటి “ఉమా శంకరి” తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ప్రముఖ సీనియర్ నటి సుమిత్ర కుమార్తెగా 2000 సంవత్సరంలో దర్శకుడు సీమాన్ తెరకెక్కించిన ‘వీరనడై’ చిత్రంతో హీరోయిన్‌గా కోలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతోనే తన సహజ నటన, అందంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

అల్లు అర్జున్‌తో మూవీపై మల్లు డైరెక్టర్ క్రేజీ అప్డేట్.. ఇక షురూ !!
అల్లు అర్జున్‌తో మూవీపై మల్లు డైరెక్టర్ క్రేజీ అప్డేట్.. ఇక షురూ !!

కాగా ‘కలకలప్పు’, ‘చొక్కా తంగం’, ‘వికడన్’, ‘సూర్యన్’ సహా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తమిళంలో చివరగా అజిత్ హీరోగా నటించిన ‘వలిమై’ చిత్రంలో యంగ్ సుమిత్ర పాత్రలో కనిపించి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలానే తెలుగులో కూడా విక్టరీ వెంకటేష్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘లక్ష్మి’లో ఆయన చెల్లి పాత్రతో మంచి గుర్తింపు పొందింది. కెరీర్ మంచి దశలో ఉండగానే 2006లో ఉమా శంకరి వివాహం చేసుకుని సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పారు.

actress-uma-shankari-post-about-cancer-treatment-got-full-viral-on-social-media-and-netizens-reactio

అయితే పెళ్లి తర్వాత కుటుంబ జీవితానికే ప్రాధాన్యం ఇస్తూ మీడియాకు, సోషల్ మీడియాలోకి దాదాపు దూరమయ్యారు. అయితే వెండితెరపై చిరునవ్వులతో ప్రేక్షకులను అలరించిన ఈ నటి.. ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడం హాట్ టాపిక్ గా మారింది.

సోషల్ మీడియా పోస్ట్ వైరల్..

ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఉమా శంకరి.. తాను రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కీమోథెరపీతో పాటు ఇమ్యునోథెరపీ చికిత్స తీసుకుంటున్నానని.. ఈ పోరాటాన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నానని రాసుకొచ్చారు. నాకు అండగా నిలుస్తున్న నా కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమతో, ఆప్యాయతతో నన్ను ప్రోత్సహిస్తున్న అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

ఇక ఉమా శంకరి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో గౌతమి, మమతా మోహన్‌దాస్, సోనాలి బింద్రే, మనీషా కోయిరాలా వంటి నటీమణులు సైతం క్యాన్సర్‌ను జయించి.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన విషయం తెలిసిందే.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments