- మరోసారి వెలుగులోకి వచ్చిన 130 సర్వే నెంబర్
- గతంలో నిర్మాణాన్ని కూల్చేసిన మున్సిపల్ అధికారులు
- మళ్లీ ప్రారంభమైన పనులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలో మళ్ళీ మొదలైన భూవివాదం.. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని అధికారులు కూల్చివేతలు చేసి పనులను ఆపారు. మళ్ళీ ఆ పనులు ప్రారంభమైయాయి. తాండూరు పట్టణం లోని 130 సర్వే నెంబర్ భూవివాదం మరో సారి తెరపైకి వచ్చింది. గతంలో అక్కడ కట్టడాలను అడ్డుకొని మున్సిపల్ కమీషనర్ కట్టడాలను కూల్చేసి పనులు ఆపిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా 130 సర్వే నెంబర్ లో పనులు మళ్ళీ ప్రారంభమైయాయి. 130 సర్వే నెంబర్ లోని 36 గుంటల స్థలం పూర్తిగా ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు తేల్చి చెప్పారు. ఆ స్థలం వివాదం తో ఉండడం తో కొద్దీ రోజులుగా 130 సర్వే నెంబర్ లో పనులు నిలిపిపోయాయి. ప్రస్తుతం 129 సర్వే నెంబర్ పేరుతో అక్కడ పనులను ప్రారంభించారు. 130 సర్వే నెంబర్ స్థలానికి అనుకొనే 129 భూమి ఉంది. ఐతే అక్రమ కట్టడాలను సర్వే నెంబర్ మార్చి నిర్మిస్తున్నారని… పలువురు ఆరోపించారు. 130 ప్రభుత్వ స్థలం లోను పనులు చేస్తూ…. 129 లో నిర్మాణం చేస్తున్నట్లు చూపిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం చేపడుతున్న అధికారులు చూసిన వ్యవహరిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. 130 సర్వే నెంబర్ భూమిలో సర్వే చేసేంతవరకు పనులు కొనసాగించవద్దని, ఏ సర్వే నంబర్ ఎటు వస్తుందో తేల్చి చెప్పాకే నిర్మాణాలు చేసుకోవాలని ప్రతిపక్ష నాయకుడు కూడా పలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఆ స్థలంలో సర్వే చేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై తాండూర్ లో ప్రస్తుతం మళ్లీ చర్చలు జరుగుతున్నాయి.