HomeTelanaganahyderabadతాండూరులో రేపు మంత్రుల పర్యటన..!

తాండూరులో రేపు మంత్రుల పర్యటన..!

  • మంత్రుల పర్యటనను జయప్రదం చేయండి
  • రూ. 290 కోట్ల రహదారి పనులకు శంకుస్థాపన
  • భూనిర్వాసితులకు రూ. 25 కోట్ల పరిహార చెక్కుల పంపిణీ
  • కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగు 

జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు లో రేపు రాష్ట్ర మంత్రుల పర్యటనను విజయవంతం చెయ్యాలని తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాతుల నాగు పిలుపునిచ్చారు. స్థానిక శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవతో తాండూరు లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానున్నారు. శనివారం ఉదయం 10:00 గంటలకు అంతారం గ్రామ పరిధిలో రూ. 290 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న హ్యామ్ రహదారి అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ల చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవం జరగనుందని ఆయన వెల్లడించారు.అనంతరం ఉదయం 10:15 గంటలకు కందనెల్లి పరిధిలోని జీపీఆర్ గార్డెన్స్‌లో బైపాస్ రోడ్డు నిర్మాణ భూనిర్వాసితులకు రూ. 25 కోట్ల విలువైన పరిహార చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అదే వేదికపై భారీ ప్రగతి సభ నిర్వహించబడుతుందని స్పష్టం చేశారు.ఈ ప్రగతి సభకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని బాతుల నాగు కోరారు. ప్రజల రాకే తాండూరు అభివృద్ధికి మరింత బలమని ఆయన ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments