HomeBusinessఅయ్యో.. పేదవాడి కారును ఎవరూ పట్టించుకోవడం లేదు.. ఒకప్పుడు కొనాలంటే వెయిటింగ్!

అయ్యో.. పేదవాడి కారును ఎవరూ పట్టించుకోవడం లేదు.. ఒకప్పుడు కొనాలంటే వెయిటింగ్!

అయ్యో.. పేదవాడి కారును ఎవరూ పట్టించుకోవడం లేదు.. ఒకప్పుడు కొనాలంటే వెయిటింగ్!

ఒకప్పుడు తక్కువ బడ్జెట్‌లో తొలి కారును కొనుగోలు చేయాలనుకునే వారి జాబితాలో మారుతి సుజుకి సెలెరియో (maruti suzuki celerio) ముందువరుసలో ఉండేది. సరసమైన ధర, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ కారును ఎక్కువగా ఎంచుకునేవి. ముఖ్యంగా మొదటిసారి కారు కొనుగోలు చేసే వారు సెలెరియో కోసం షోరూమ్‌లకు పెద్ద ఎత్తున వెళ్లేవారు. అయితే గత కొన్ని నెలలుగా ఈ కారుకు ఉన్న డిమాండ్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా విడుదలైన జూన్ 2026 అమ్మకాల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి, గత నెలలో సెలెరియోతో ఆశించిన స్థాయి అమ్మకాలను నమోదు చేయలేకపోయింది.

జూన్ 2026లో కేవలం 1,261 యూనిట్ల సెలెరియో కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 2,038 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, ఈసారి 38.13 శాతం వార్షిక క్షీణత. అంటే, ఒక్క ఏడాదిలోనే 777 యూనిట్ల అమ్మకాలు తగ్గాయి. ప్రస్తుతం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో పెరుగుతున్న పోటీ, కొనుగోలుదారులు SUVలు, మైక్రో SUVల వైపు మొగ్గు చూపడం వంటి కారణాలు సెలెరియో అమ్మకాలపై ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Maruti Suzuki Celerio Hatchback Sales Drop 38 Percent In June 2026

అయినప్పటికీ, తక్కువ ధర, మంచి మైలేజ్, నగర ప్రయాణాలకు అనువైన డ్రైవింగ్ అనుభవం వంటి బలాలతో సెలెరియో ఇప్పటికీ బడ్జెట్ కారు కోసం చూస్తున్న వినియోగదారులకు ఒక మంచి ఎంపికగానే కొనసాగుతోంది. ధర విషయానికి వస్తే, సెలెరియో ప్రస్తుతం LXI, VXI, ZXI, ZXI+ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.70 లక్షల నుంచి రూ. 6.73 లక్షల వరకు ఉంటుంది.

అందుబాటు ధరలో మంచి మైలేజ్ కలిగిన హ్యాచ్‌బ్యాక్ కోసం చూస్తున్న వారికి సెలెరియో బెస్ట్. పనితీరు పరంగా ఇందులో 1.0 లీటర్ K సిరీస్ పెట్రోల్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 66 bhp పవర్, 92 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. నగరంలో రోజువారీ ప్రయాణాలకు అనువైన స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని ఈ ఇంజన్ అందిస్తుంది.

Maruti Suzuki Celerio Hatchback Sales Drop 38 Percent In June 2026

ఇక ఎక్కువ మైలేజ్ కోసం మారుతి CNG కూడా అందిస్తోంది. CNG మోడ్‌లో పవర్ కొద్దిగా తగ్గినప్పటికీ, పెట్రోల్ ఖర్చును గణనీయంగా తగ్గించే మైలేజ్‌ను ఇది అందిస్తుంది. కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం, సెలెరియో CNG ఒక కిలో CNGతో 32.85 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. అదే పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 24.97 కిలోమీటర్లు, పెట్రోల్ AMT వేరియంట్ లీటరుకు 25.24 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను అందిస్తుంది.

ఫీచర్ల పరంగా కూడా మారుతి సుజుకి సెలెరియో తన ధరకు తగ్గట్టుగా డజన్ల కొద్ది అందిస్తుంది. ఇందులో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఇవి రోజువారీ డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా మార్చడంతో పాటు, ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని అందిస్తాయి.

Maruti Suzuki Celerio Hatchback Sales Drop 38 Percent In June 2026

భద్రత విషయంలో కూడా సెలెరియో ఆకట్టుకునే ఫీచర్లతో వస్తోంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో పాటు ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి కీలక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ భద్రతా వ్యవస్థలు అత్యవసర పరిస్థితుల్లో వాహనంపై డ్రైవర్‌కు మెరుగైన నియంత్రణను అందించడంలో సహాయపడతాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments