Home Entertainment Bhagyaraj: బతికుండగా పట్టించులేదు.. ఇప్పుడు నెరవేర్చారు

Bhagyaraj: బతికుండగా పట్టించులేదు.. ఇప్పుడు నెరవేర్చారు

7
0


Bhagyaraj: బతికుండగా పట్టించులేదు.. ఇప్పుడు నెరవేర్చారు

Jul 7, 2026 3:01PM

Google search engine

 

తమిళ చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ నటుడు, దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత కే. భాగ్యరాజ్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. 73 ఏళ్ల వయసులో హఠాత్తుగా సంభవించిన గుండెపోటు కారణంగా ఆయన మరణించడం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భాగ్యరాజ్ కేవలం నటుడే కాదు, కథను నడిపించడంలో అద్భుతమైన ప్రతిభ ఉన్న అగ్రశ్రేణి సృష్టికర్త. ఆయన తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 25 కంటే ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, 75కి పైగా సినిమాల్లో వైవిధ్యభరితమైన  క్యారక్టర్లతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నారు. అలాంటి గొప్ప కళాకారుడు భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా, ఆయన చిరకాల కోరిక ఒకటి ఇప్పుడు నెరవేరింది.

మరణించడానికి కొద్దిరోజుల ముందే భాగ్యరాజ్ తన జీవిత ప్రయాణాన్ని, సినీ రంగానికి సంబంధించిన మధుర స్మృతులను క్రోడీకరిస్తూ ‘పడిచ్చా పుడిచిర్లాం’ అనే పేరుతో ఒక అద్భుతమైన స్వీయచరిత్రాన్ని (ఆటోబయోగ్రఫీ) రాసుకున్నారు. ఈ పుస్తకానికి ఒక మనోహరమైన ముందుమాట (ఫోర్‌వర్డ్) రాయాలని ఆయన ఎంతో ఆశపడ్డారు. ఇందుకోసం 2026 జూన్ 17వ తేదీన తన పుస్తక ప్రతినోకదాన్ని ప్రముఖ గీత రచయిత, కవి వైరముత్తుకు పంపించి, ప్రేమతో ముందుమాట రాసివ్వాలని కోరారు. ఆ సమయంలో వైరముత్తు ఇతర పనుల్లో బిజీగా ఉండటం వల్ల “కొంచెం సమయం కావాలి” అని అడగ్గా, భాగ్యరాజ్ ఎప్పటిలాగే తన మార్కు చిరునవ్వుతో “సరే” అని సమాధానమిచ్చారు. కానీ అదే వారి మధ్య చివరి సంభాషణ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఆ తర్వాత సరిగ్గా పది రోజులకు, అంటే జూన్ 27వ తేదీన భాగ్యరాజ్ మరణించారనే వార్త వైరముత్తును తీవ్రంగా కలచివేసింది.

భాగ్యరాజ్ మరణానంతరం వైరముత్తు ఆ స్వీయచరిత్ర పుస్తకాన్ని పూర్తిగా చదివారు. ఆ పుస్తకంలోని ప్రతి పేజీ ఆయనని ఎంతగానో కదిలించింది. భాగ్యరాజ్ తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన పేదరికం, అవమానాలు, పరాజయాలు, పోరాటాలు మరియు అనుభవించిన మానసిక వేదనలను చూసి వైరముత్తు కంటతడి పెట్టారు. భాగ్యరాజ్ బతికుండగా ఆ కోరికని తీర్చలేకపోయాననే బాధతో, ఆయన మరణించిన తర్వాత పూర్తి భావోద్వేగంతో ఆ పుస్తకానికి అద్భుతమైన ముందుమాటని  రాశారు. సాధారణంగా అయితే దీనిని ఈమెయిల్ ద్వారా పంపవచ్చు, కానీ భాగ్యరాజ్ పై ఉన్న గౌరవంతో వైరముత్తు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. భాగ్యరాజ్ భార్య పూర్ణిమ, కొడుకు శాంతనులను కలిసి ఆ ముందుమాట ప్రతిని వారికి అందజేశారు. ఈ సందర్భంగా పూర్ణిమ భాగ్యరాజ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పుస్తకం ఒక మనిషి జీవిత స్పందన అని, దీనిని త్వరలోనే ప్రచురించాలని వైరముత్తు ఆకాంక్షించారు.

Also read: Prakash raj: ఈ నటుడుకి కులం లేదు.. ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్ 

 

 



Source link

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here