HomeNewsపేకాట రాయుళ్ల అరెస్ట్...!

పేకాట రాయుళ్ల అరెస్ట్…!

spot_img
JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • పేకాట ఆడుతూ పట్టుబడిన ముగ్గురు.. నగదు సీజ్
  • పేకాట ఆడితే కఠిన చర్యలు: హెచ్చరించిన యాలాల పోలీసులు

జనవాహిని ప్రతినిధి యాలల్ : యాలాల మండలంలో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఫర్దేకుంట శివారులో పేకాట ఆడుతున్న సమాచారం అందుకున్న ఎస్సై విట్టల్ రెడ్డి తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు.ఈ సోదాల్లో సంఘం కూర్దు గ్రామానికి చెందిన ఊరి బయట రాజు, అల్లకోటి విష్ణు, మీది కేరి వెంకటయ్యలు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. వారి వద్ద ఉన్న రూ. 2,800 నగదును పోలీసులు సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై విట్టల్ రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో ఎవరైనా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే సహించేది లేదన్నారు. జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను ఎవరైనా ప్రోత్సహిస్తే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు.

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments