HomeEntertainment"జైలర్ 2" టీజర్ రిలీజ్.. ఇదేం విధ్వంసం బాబోయ్..!

“జైలర్ 2” టీజర్ రిలీజ్.. ఇదేం విధ్వంసం బాబోయ్..!

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY


“జైలర్ 2” టీజర్ రిలీజ్.. ఇదేం విధ్వంసం బాబోయ్..!

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే థియేటర్ల వద్ద పండగ వాతావరణం ఉంటుంది. ఆయన నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ “జైలర్ 2”. ఈ మూవీ షూటింగ్ తాజాగా పూర్తయింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చివర్లో రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. “జైలర్ 2” మూవీ ఈ ఏడాది అక్టోబర్ 10 న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ ఆసక్తికరంగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మార్క్ మరోసారి టీజర్ లో కనిపిస్తోంది.

Jailer2 Release Date Confirmed Rajinikanth Starrer to Hit Screens on October 10 Jailer 2 release

ఈ టీజర్ కు అనిరుధ్ ఇచ్చిన బీజీఎం హైలెట్ గా నిలిచింది. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. జైలర్ పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ కావడంతో జైలర్ 2 పై అంచనాలు భారీగా పెరిగాయి. టీజర్ చూస్తుంటే పార్ట్ 1 కు మించిన సస్పెన్స్, యాక్షన్ సీన్స్ జైలర్ 2 లో దాచినట్లు స్పష్టం అవుతోంది. టీజర్ రిలీజ్ తో ఒక్కసారిగా జైలర్ 2 మూవీపై హైప్ పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 20 న దసరా పండగ ఉన్న నేపథ్యంలో పండగ సీజన్ టార్గెట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ రానున్నట్లు స్పష్టం అవుతోంది. జైలర్ మూవీ రజనీకాంత్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో బెస్ట్ మూవీ అనే చెప్పాలి. దాంతో జైలర్ 2 ను మరింత కసిగా దర్శకుడు నెల్సన్ మలిచాడు.

జైలర్ మూవీ 2023 లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఏకంగా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు జైలర్ 2 మూవీ అంతకు డబుల్ లేదా త్రిబుల్ సక్సెస్ కొట్టే అవకాశం ఉంది. ఇప్పటికే సూపర్ స్టార్ క్రేజ్ పీక్స్ లో ఉంది. దాంతో ఈ మూవీ రూ. 1000 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. ఇక మొదటి పార్ట్ ఎక్కడైతే ముగిసిందో సెకండ్ పార్ట్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక ఈ చిత్రాన్ని కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ ​పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.



Source link

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments