HomeEntertainmentAlpha Movie Review: ఆలియా మెప్పించిందా..ప్రేక్షకుల ఫస్ట్ టాక్ ఇదే..!!

Alpha Movie Review: ఆలియా మెప్పించిందా..ప్రేక్షకుల ఫస్ట్ టాక్ ఇదే..!!

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY


Alpha Movie Review: ఆలియా మెప్పించిందా..ప్రేక్షకుల ఫస్ట్ టాక్ ఇదే..!!

బాక్సాఫీస్ వద్ద జిగ్రా సినిమాతో బోల్తా కొట్టిన తర్వాత ఆలియా భట్ ఆల్ఫా అనే మూవీతో మళ్లీ బిగ్‌స్క్రీన్ పై కనిపించింది.వైఆర్ఎఫ్ స్పై యూనివర్శల్ బ్యానర్‌లో వచ్చిన చిత్రమే ఆల్ఫా. అయితే ఈ ప్రొడక్షన్ హౌజ్‌ నుంచి వచ్చిన రీసెంట్ చిత్రాలు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. వార్ 2,టైగర్ 3 చిత్రాలకు అడ్రస్ లేకపోవడంతో… ఇక ఆలియా భట్,బాబీడియోల్, శర్వరి నటించిన ఆల్ఫా చిత్రం పైనే మూవీ మేకర్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది..? టాక్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆల్ఫా చిత్రం విడుదలైన తొలి రోజే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో తొలి మహిళా ప్రధాన యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో ఆలియా భట్, శర్వరి ప్రధాన పాత్రల్లో నటించగా, బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించారు.ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు “ది రైల్వే మెన్” ఫేమ్ డైరెక్టర్ శివ్ రవైల్. అయితే సినిమా విడుదల తర్వాత వచ్చిన ఫస్ట్ టాక్ ప్రకారం సినిమా యాక్షన్, నటనతో ఆకట్టుకున్నప్పటికీ కథ, స్క్రీన్‌ప్లే విషయంలో మిశ్రమ స్పందనను అందుకుంటోంది.

alpha-movie-review-alia-bhatt-impresses-story-divides-audience-faces-criticism

యాక్షన్ సీక్వెన్స్‌లే హైలైట్

సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్‌లు, స్టంట్స్, విజువల్ ప్రెజెంటేషన్‌కు ప్రేక్షకులు మంచి మార్కులు వేస్తున్నారు. ఆలియా భట్ తన కెరీర్‌లో తొలిసారిగా పూర్తి స్థాయి యాక్షన్ అవతార్‌లో కనిపించగా, శర్వరి కూడా తన ఎనర్జీతో ఆకట్టుకుంది. ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కథపై భిన్నాభిప్రాయాలు

ఇందులో నటించిన ఆలియా భట్, శర్వరి, బాబీ డియోల్‌లు నటన అద్భుతంగా ఉన్నప్పటికీ… కథనం ఆశించిన స్థాయిలో లేదని కొంతమంది ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. స్పై థ్రిల్లర్‌గా మంచి కాన్సెప్ట్ ఉన్నా, స్క్రీన్‌ప్లేలో బలం తగ్గిందని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. కొన్ని ట్విస్టులు ప్రభావం చూపకపోవడంతో సినిమా సగటు అనుభూతినే ఇస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాలో ప్రత్యేక అతిథి పాత్రలో హృతిక్ రోషన్ కనిపించారు. హృతిక్ స్క్రీన్ పై కనిపించగానే అభిమానుల ఈలలు, చప్పట్లతో థియేటర్లు మారిమోగిపోయాయి.

మొత్తంగా చూస్తే ‘ఆల్ఫా’ అద్భుతమైన యాక్షన్, బలమైన నటనతో మెప్పించే ప్రయత్నం చేసినప్పటికీ, కథ, భావోద్వేగాల పరంగా ప్రేక్షకులందరినీ పూర్తిగా సంతృప్తిపరచలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని ఒక్కసారి చూడొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇక మీరు కూడా ఈ వీకెండ్ ఈ సినిమా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.



Source link

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments