HomeNewsక్షమాపణకు జంకే.. బైకాట్ డ్రామాలు..!

క్షమాపణకు జంకే.. బైకాట్ డ్రామాలు..!

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ను దొంగచాటుగా వీడియో తీసిన కౌన్సిలర్ జావీద్
  • సమక్షంలో నిలదీస్తారనే భయంతో కౌన్సిల్ సమావేశానికి డుమ్మా
  • తప్పు చేయనప్పుడు మొహం చాటేయడం ఎందుకు?
  • తాండూరు 10వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం

జనవాహిని ప్రతినిధి,తాండూరు:చేసిన తప్పుకు ఎక్కడ అందరి ముందు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌కు క్షమాపణ చెప్పాల్సి వస్తుందోననే భయంతోనే కౌన్సిలర్ జావీద్ కౌన్సిల్ సమావేశం నుండి పారిపోయారని 10వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ తీవ్రంగా ఆరోపించారు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మహిళా ఛైర్‌పర్సన్‌పై దొంగచాటుగా వీడియోలు తీయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. గత రెండు రోజుల క్రితం మున్సిపల్ అజెండా అంశం పై చర్చ కోసం పార్టీల ఫ్లోర్ లీడర్ లను మున్సిపల్ ఛైర్పర్సన్ కార్యాలయానికి ఆహ్వానించారు. కౌన్సిలర్ లకు అనుమతి లేకున్నా వచ్చిన సందర్బంగా కౌన్సిలర్ లను గౌరవించి కూర్చోబెట్టారు. ఈ క్రమంలో నే మున్సిపల్ ఛైర్పర్సన్ మాటలను దొంగ చాటున రికార్డు చేయ్యడం సిగ్గు చేటని శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే తాండూరు మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. పట్టణ అభివృద్ధి, ప్రజల సమస్యలపై చర్చించాల్సిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ కూడా హాజరయ్యారు. అయితే, సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ఆయన ఒక్కసారిగా బైకాట్.. బైకాట్ అంటూ సభ నుండి వాకౌట్ చేసి వెళ్ళిపోవడం తీవ్ర కలకలం రేపింది. గత రెండు రోజుల క్రితం మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఛాంబర్‌లో బీఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ దొంగచాటుగా ఛైర్‌పర్సన్ మాట్లాడుతున్న వీడియోను మొబైల్‌లో రికార్డు చేశారు. ఒక మహిళా ఛైర్‌పర్సన్ అని కూడా చూడకుండా, నైతిక విలువలను పక్కనబెట్టి ఇలా దొంగచాటుగా వ్యవహరించడంపై మున్సిపల్ వర్గాల్లో తీవ్ర దుమారం రేగింది.ఎక్కడ సారీ చెప్పాల్సి వస్తుందనే భయంతోనే సమావేశం నుంచి తప్పించుకోవడానికి ‘బైకాట్’ అనే కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. నిజంగా ఆయన ఎలాంటి తప్పు చేయనట్లయితే సమావేశం లో కూర్చొని సమాధానం చెప్పాలి కానీ, ఇలా మొహం చాటేసి పారిపోవడం ఆయన తప్పును ఆయనే ఒప్పుకున్నట్లయిందని శ్రీకాంత్ పేర్కొన్నారు.పట్టణ సమస్యలను పక్కనబెట్టి, ఇలాంటి చిల్లర రాజకీయాలకు, వ్యక్తిగత కక్షలకు పాల్పడటం మున్సిపాలిటీ ప్రతిష్టను దిగజార్చుతోందని కౌన్సిలర్ శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, మహిళా అధికారులను, ప్రజాప్రతినిధులను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. జావీద్ చేసిన ఈ డ్రామాలను తాండూరు ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ఆయనకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments