HomeTelanaganahyderabadహద్దులు దాటి మాట్లాడొద్దు....!

హద్దులు దాటి మాట్లాడొద్దు….!

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • తాండూరులో రెచ్చగొట్టే రాజకీయాలు స్వస్తి పలకాలి
  • యువనాయకుడు పటేల్ తేజ

జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణాన్ని భంగపరిచేలా ర్యాలీలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తగదని, ఇకనైనా ఇటువంటి రౌడీ రాజకీయాలను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు పటేల్ తేజ డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఆయన సోదరుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హద్దులు దాటితే సాహించేది లేదన్నారు.
రాజకీయాలకు ఒక హద్దు ఉంటుంది
రాజకీయ విమర్శలకు ఒక పరిమితి ఉంటుందన్నారు. ఆ హద్దు దాటి వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం, ప్రజా శాంతికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే చట్టపరంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ర్యాలీల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి, అల్లర్లకు దారితీసే పరిస్థితులు కల్పించడం బాధ్యతాయుతమైన నాయకత్వం అనిపించుకోదని తేజ మండిపడ్డారు.
కష్టపడి పైకి వచ్చిన నాయకులు
బుయ్యని సోదరులు సాధారణ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి, తమ సొంత కష్టంతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రజాసేవలోకి అడుగుపెట్టారని నేతలు తెలిపారు. డ్రగ్స్ దందా, భూ కబ్జాలు, అక్రమ వ్యవహారాల ద్వారా ఎదిగిన చరిత్ర వారిది కాదని స్పష్టం చేశారు.
ప్రజా తీర్పే స్పష్టమైన సమాధానం
ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే వారికి స్థానిక ప్రజలే తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పే ఎవరి బలం ఏమిటో, ప్రజల నమ్మకం ఎవరి వైపు ఉందో స్పష్టం చేసిందని, ఆ తీర్పే అన్ని విమర్శలకు తగిన సమాధానమని గుర్తుచేశారు. బుయ్యని సోదరులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా పటేల్ తేజ డిమాండ్ చేశారు.

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments