HomeNewsసర్' (SIR) ప్రక్రియలో సమన్వయంతో పనిచేయాలి: కన్వీనర్ కరణం పురుషోత్తం రావు

సర్’ (SIR) ప్రక్రియలో సమన్వయంతో పనిచేయాలి: కన్వీనర్ కరణం పురుషోత్తం రావు

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు ఓటరు జాబితా సవరణపై ముమ్మర అవగాహన
  • గౌతాపూర్‌లో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జాదవ్ ధారసింగ్ నాయక్

తాండూరు, జూన్ 26 :- ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా తాండూరు నియోజకవర్గంలో అవగాహన కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు ఆధ్వర్యంలో గౌతాపూర్, చెంగోల్, జింగుర్తి, మల్కాపూర్ గ్రామాలలో ఓటర్లకు ఈ ప్రక్రియపై విస్తృత అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు జాదవ్ ధారసింగ్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని, మండల ముఖ్య నాయకులు, బీఎల్ఓలు (BLO), బూత్ లెవెల్ ఏజెంట్లతో (BLA) కలిసి పత్రాలను పంపిణీ చేశారు.

బాధ్యతాయుతంగా వ్యవహరించి ఓటును కాపాడాలి

తాండూరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు అంతా ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని కన్వీనర్ పురుషోత్తం రావు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును కాపాడాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల నమోదు, సవరణలో ఎటువంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.

భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు

ఈ అవగాహన మరియు పత్రాల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ రవి గౌడ్, ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ళ నర్సింలు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నర్సి రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరీశ్వర్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు రాజ్ కుమార్, మాజీ అధ్యక్షులు నాగప్ప, సర్పంచ్ సృజన ఉన్నారు.అలాగే సీనియర్ నాయకులు మల్కాపూర్ జనార్ధన్ రెడ్డి, రాజు పటేల్, రాము చెంగోల్, బోయిని నర్సింలు, అజ్మత్ అలీ, రషీద్, కోతి గోపాల్, గోపాల్ రెడ్డి, బందెప్ప, మౌలానా తో పాటు బీఎల్ఏలు శ్రీనివాస్, మల్లేష్, రఘునాథ్ రెడ్డి, పండరి, జగదీష్ గౌడ్, అజమ్ పాషా, శాంతప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments