HomeNewsపేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం...!

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం…!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • 15వ వార్డు కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప చేతుల మీదుగా పంపిణీ
  •  పట్టణ ప్రగతి కోసమే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తపన
  • దివిటి ఎల్లప్ప 15 వ వార్డ్ కౌన్సిలర్ 

జనవాహిని ప్రతినిధి, తాండూరు:తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. వార్డు కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, స్థానిక నిరుపేద మహిళలకు చీరలను అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప మాట్లాడుతూ.. మహిళా సాధికారత, వారి ఆత్మగౌరవ రక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వ పాలనలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు నేరుగా అందుతాయని భరోసా ఇచ్చారు. తాండూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు, ప్రజల కష్టాలను తీర్చేందుకు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే అండతో 15వ వార్డుతో పాటు పట్టణంలోని అన్ని వార్డులను ఆదర్శవంతంగా, సుందరంగా తీర్చిదిద్దుతామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయని దివిటి ఎల్లప్ప హర్షం వ్యక్తం చేశారు. ఉచితంగా చీరలు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments