HomeNewsగుండెపోటుతో పరుశురాములు మేస్త్రి మృతి..!

గుండెపోటుతో పరుశురాములు మేస్త్రి మృతి..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • గుండెపోటుతో వడ్డెర సంఘం రాష్ట్ర నేత, వైసిపి నాయకుడు వడ్డే పరశురాములు మేస్త్రి అకాల మరణం
  •  రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో తీవ్ర శోకం
  • నేడు మధ్యాహ్నం 3 గంటలకు అంతారం గ్రామంలో అంత్యక్రియలు

జనవాహిని ప్రతినిధి తాండూరు :  ప్రముఖ వడ్డెర సంఘం నేత, వైసిపి నాయకుడు వడ్డే పరశురాములు మేస్త్రి సోమవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గొల్లచెరువు ప్రాంతంలో నివాసముండే పరశురాం మేస్త్రికి తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన తాండూరు పట్టణంలోని ప్రసిద్ధ పోట్లీ మహారాజ్ టెంపుల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను మేస్త్రిగా పర్యవేక్షిస్తున్నారు. పరశురాం మేస్త్రి సమాజంలో కులమతాలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి ఉండేవారని స్థానికులు గుర్తుచేసుకున్నారు. ఎదురొచ్చిన ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించే మనస్తత్వం ఉన్న ఆయన అకాల మరణం చెందారనే వార్త తెలియగానే వడ్డెర సంఘం శ్రేణులు, వివిధ పార్టీల నాయకులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మృతుడు పరశురాం మేస్త్రి కుటుంబానికి తాండూరు నియోజకవర్గ రాజకీయాల్లో ఎంతో మంచి పేరుంది. ఆయన సోదరుడు శ్రీనివాస్ గతంలో ఏఎంసీ (మార్కెట్ కమిటీ) చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించగా, మరో సోదరుడు నర్సింలు మేస్త్రి గతంలో మున్సిపల్ కౌన్సిలర్‌గా సేవలు అందించారు. నర్సింలు మేస్త్రి కుమారుడు మన్నపురం రాము ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు. సుదీర్ఘ కాలంగా వడ్డెర సంఘంతో పాటు అన్ని వర్గాల ప్రజలతో మమేకమై, ప్రజాసేవలో ఉన్న కుటుంబం నుంచి ఒక ముఖ్య నాయకుడు మరణించడంతో తాండూరులో శోకసంద్రం నెలకొంది. పరశురాం మేస్త్రి భౌతికకాయాన్ని సందర్శించి పలువురు ప్రముఖులు అశ్రునయనం మధ్య నివాళులర్పించారు.పరశురాం మేస్త్రి అంత్యక్రియలను నేడు మధ్యాహ్నం 3 గంటలకు వారి స్వగ్రామమైన అంతారం గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments