- మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ స్వప్న పరిమళ్, కాంగ్రెస్ సీనియర్ నేత అబ్దుల్ రావుఫ్‌లకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు
- వారి నివాసాలకు వెళ్లి సత్కరించిన ఆర్‌బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
- పాల్గొన్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగు, ఆలయ మాజీ చైర్మన్ పటేల్ కిరణ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ రావుఫ్ ల జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆర్‌బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరులోని వారి నివాసాలకు స్వయంగా వెళ్లి, వారిని శాలువాలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.ఈ వేడుకల్లో తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాతుల నాగు, భద్రేశ్వర ఆలయ మాజీ చైర్మన్ పటేల్ కిరణ్, కాంగ్రెస్ నాయకులు బంటు మలప్ప, సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తమపై అభిమానంతో నివాసానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపిన శ్రీనివాస్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్వప్న పరిమళ్, అబ్దుల్ రావుఫ్‌లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.




