HomeNewsస్పీకర్ కు శుభాకాంక్షల వెల్లువ..!

స్పీకర్ కు శుభాకాంక్షల వెల్లువ..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు
  • వికారాబాద్‌లో ఘనంగా సత్కరించిన తాండూరు కాంగ్రెస్ నాయకులు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జన్మదిన వేడుకలు వికారాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని తాండూరు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు గురువారం వికారాబాద్‌లోని స్పీకర్ నివాసానికి వెళ్లారు. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్డిఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు బాతుల నాగు, భద్రేశ్వర ఆలయ మాజీ చైర్మన్ కిరణ్ పటేల్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజానేత, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, భగవంతుడు ఆయనకు మరిన్ని ఉన్నత పదవులను, ప్రజాసేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ పరిధిలోని పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments