HomeNewsకాగితాలకే పరిమితమైన వార్డు సభలు !

కాగితాలకే పరిమితమైన వార్డు సభలు !

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • అధికారులపై కౌన్సిలర్ నిప్పులు
  • ‘ఐదేళ్లుగా కల్వర్టు ముచ్చటే.. కాల్వ తుడిపించే దిక్కులేదు
  • పెన్షన్ల జీవో లేకుండా అప్లికేషన్లు ఎందుకు?
  • మున్సిపల్ తీరుపై కౌన్సిలర్ జావీద్ ఆగ్రహం 

జనవాహిని ప్రతినిధి తాండూరు : వార్డు సభలు కేవలం అప్లికేషన్లు తీసుకోవడానికేనా? ప్రజల సమస్యలు తీర్చేది ఎప్పుడు? అంటూ స్థానిక కౌన్సిలర్ జావీద్ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ పై మండిపడ్డారు. శనివారం రాజీవ్ కాలనీలో నిర్వహించిన వార్డు సభ తీవ్ర వాదోపవాదాల నడుమ హీటెక్కింది. వార్డులో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను ఏకరువు పెడుతూ కౌన్సిలర్ అధికారులను నిలదీశారు.వార్డు అభివృద్ధి కోసం అడిగినప్పుడల్లా నిధులు లేవనే సాకులు చెబుతున్నారని కౌన్సిలర్ మండిపడ్డారు. బోర్ వెల్స్, సిసి రోడ్ల ప్రతిపాదనలు పేపర్లకే పరిమితమయ్యాయన్నారు. ఐదేళ్ల క్రితం కల్వర్టు శాంక్షన్ అయిందని చెప్పారు.. కానీ ఇప్పటివరకు కనీసం మురుగు కాల్వ తుడిపించిన పాపాన పోలేదన్నారు ఒక్క బోర్ అయినా వేశారా?” అని నిలదీశారు. స్వల్ప వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని, దోమల కారణంగా పిల్లల ఆరోగ్యం ఖరాబవుతోందని సభకు వచ్చిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రజలు వార్డు సభలంటేనే విసిగిపోయారని, అందుకే జనాలు రావడం లేదని కౌన్సిలర్ స్పష్టం చేశారు. సమస్యలు రాసుకోవడం కాదు.. పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్, చైర్మన్లతో పాటు అవసరమైతే ఎమ్మెల్యేతో కూడా మాట్లాడి సమస్యలు తేలుస్తానన్నారు.కొత్త పెన్షన్ల విషయమై సభలో పెద్ద చర్చ నడిచింది. అర్హులైన పేదలు పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని కౌన్సిలర్ ప్రశ్నించగా.. తాము దరఖాస్తులు మాత్రమే తీసుకుంటున్నామని వార్డు ఆఫీసర్ బదులిచ్చారు. దీనిపై కౌన్సిలర్ స్పందిస్తూ.. ప్రభుత్వం నుంచి కొత్త పెన్షన్ల మంజూరుకు ఎలాంటి జీవో రానప్పుడు, అప్లికేషన్లు తీసుకొని ప్రజలను ఎందుకు భ్రమల్లో ఉంచుతున్నారు? అని నిలదీశారు. కేవలం కాలయాపన కోసమే సభలు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించకపోతే ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments