చిరంజీవితో వెంకీ అట్లూరి క్రేజీ మూవీ.. ఆలస్యానికి కారణం ఇదే..!
మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే ఏ దర్శకుడు అయినా ఎగిరి గంతేస్తారు. కెరీర్ లో 150 కు పైగా సినిమాలు చేసి టాలీవుడ్ లో అగ్రహీరోగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవితో ఒక్కసారైనా కలిసి పని చేయాలని చాలా మంది యంగ్ దర్శకులు కలలు కంటూ ఉంటారు. కానీ అందరికీ ఆ అవకాశం రాదు. అయితే ఇటీవల వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకెళ్తున్న దర్శకుడు వెంకీ అట్లూరి. ఆయన సర్, లక్కీ భాస్కర్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. ఆ తర్వాత తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో మరో క్రేజీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అయితే వెంకీ అట్లూరికి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం వచ్చినట్లు మీకు తెలుసా..?
ఈ విషయాన్ని ఏకంగా దర్శకుడు వెంకీ అట్లూరి స్వయంగా వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవితో తాను ఓ సినిమా చేయాలని అనుకున్నానని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆయన కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వెంకీ అట్లూరి కామెంట్స్ మెగా ఫ్యాన్స్ తో పాటు అటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వెంకీ అట్లూరి వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆయన మెగాస్టార్ చిరంజీవితోనూ ఓ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని చాలామంది మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. “చిరంజీవి సార్ తో ఓ సినిమా చేయాలని అనుకున్నాను. కానీ ఆయన లాంటి పెద్ద స్టార్ హీరోతో చేసేటప్పుడు అన్నీ బాగా చూసుకోవాల్సి ఉంటుంది. నా తొలి సినిమా నుంచి మూడో సినిమా వరకు బడ్జెట్ ను కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వచ్చాను. ధనుష్ తో ‘సార్’ సినిమా నుంచి బడ్జెట్ ఇంకా పెరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు నేను అనుకున్న థ్రిల్లర్ సబ్జెక్ట్ ను చిరంజీవితో తీసే క్రమంలో నేను ఇంకాస్త ఎదగాలి అనుకుంటున్నా’ అని వెంకీ అట్లూరి తెలిపారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మన శంకర వర ప్రసాద్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇప్పుడు బాబీతో మరో సినిమా చేస్తున్నారు మెగాస్టార్.
