HomeNewsతాగునీటిని వృథా చేయకండి...!

తాగునీటిని వృథా చేయకండి…!

spot_img
JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • శివసాయి కాలనీలో నూతన బోర్వెల్ ప్రారంభం
  •  తాగునీటిని జాగ్రత్తగా వాడుకోవాలి: కౌన్సిలర్ ఎండీ జావిద్
  •  నజరేతు ప్రేయర్ హాల్, ఫ్రెష్ వాటర్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు

జనవాహిని ప్రతినిధి తాండూరు :      పట్టణంలోని 8వ వార్డు రాజీవ్ కాలనీ వెనుక భాగంలో గల శివసాయి కాలనీలో ప్రజల తాగునీటి సమస్య తీరింది. నజరేతు ప్రేయర్ హాల్ ఆధ్వర్యంలో, ఫ్రెష్ వాటర్ ఫ్రెండ్స్ సహకారంతో కాలనీలో నూతనంగా బోర్వెల్ వేసి, మోటర్ బిగించి, వాటర్ ట్యాంకర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన 8వ వార్డు కౌన్సిలర్ ఎండీ జావిద్ రిబ్బన్ కట్ చేసి ఈ నూతన బోర్వెల్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ జావిద్ మాట్లాడుతూ.. కాలనీ ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం స్వచ్ఛందంగా ముందుకొచ్చి బోర్వెల్, ట్యాంకర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ రోజు నుండి కాలనీవాసులు తాగునీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని, వాటర్ ట్యాంకర్‌ను బాధ్యతగా సంరక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రెవరెండ్ కె. అశోక్ కుమార్, అంకిత్ కురుకంటి, అచ్చా రవి, ప్రేమ్ పసరా, దీపక్, రోషన్, రోహిత్, సాంబన్న మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments