HomeNewsయువకుడి ఆత్మహత..!

యువకుడి ఆత్మహత..!

spot_img
JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య 
  • వ్యక్తిగత కారణాలతో బలవన్మరణం
  • ఖానాపూర్‌లో విషాదం

జనవాహిని   పెద్దేముల్, మే 31: పెద్దేముల్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన జోగు రవీందర్ (26) పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. రవీందర్ హైదరాబాద్‌లో పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ నెల 25న స్వగ్రామానికి వచ్చిన ఆయన వ్యక్తిగత కారణాలతో గ్రామ శివారులోని పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు సేవించాడు.సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో అతని సోదరుడు అనంతప్ప పొలం వద్దకు వెళ్లి చూడగా రవీందర్ అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం (మే 30) మృతి చెందాడు.మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దేముల్ పోలీసులు తెలిపారు.

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments