HomeTelanaganahyderabadడ్రైనేజీ సమస్యకు చెక్ ...!

డ్రైనేజీ సమస్యకు చెక్ …!

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • రూ. 5 కోట్ల   నిధులతో సీసీ డ్రైన్ పనులు ప్రారంభం
  • 20 ఏళ్ల డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం
  • చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కౌన్సిలర్ వెంకటేష్ జుంటుపల్లి

జనవాహిని ప్రతినిధి తాండూరు;  పట్టణంలోని 19వ వార్డు సీతారాంపేట్‌లో గత రెండు దశాబ్దాలుగా వేధిస్తున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. రూ. 5 కోట్ల నిధులతో చేపడుతున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్, 19వ వార్డు కౌన్సిలర్ వెంకటేష్ జుంటుపల్లి కలసి సోమవారం అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి మాట్లాడుతూ… సీతారాంపేట్ పరిధిలోని ప్రజలు దాదాపు 20 ఏళ్లుగా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను ప్రాధాన్యతగా గుర్తించి రూ.18 లక్షలతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టరు, అధికారులను ఆదేశించారు.
వార్డు కౌన్సిలర్ వెంకటేష్ జుంటుపల్లి మాట్లాడుతూ… 20 ఏళ్ల వార్డు ప్రజల నిరీక్షణకు నేటితో తెరపడిందని సంతోషం వ్యక్తం చేశారు. సీసీ డ్రైన్ నిర్మాణం పూర్తయితే వార్డులో పారిశుధ్యం మెరుగుపడటమే కాకుండా వ్యాధుల బారిన పడకుండా ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందన్నారు. అభివృద్ధి పనులకు సహకరిస్తున్న పాలకవర్గానికి వార్డు ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments