HomeNewsహ్యాపీ బర్త్డే శివన్నా....!

హ్యాపీ బర్త్డే శివన్నా….!

spot_img
JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • ఘనంగా శివకుమార్‌ రెడ్డి జన్మదిన వేడుకలు
  • సేవా స్ఫూర్తితో నిండిన వేడుకలు
  • ఆసుపత్రి లో పండ్లు పంపిణి…! 

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తనయుడు బుయ్యని శివకుమార్‌ రెడ్డి జన్మదిన వేడుకలు తాండూరులో శుక్రవారం వైభవంగా జరిగాయి. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బాతుల నాగరాజు నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకలకు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.పుట్టినరోజు వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా, సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా స్థానిక హైదరాబాద్ రోడ్డులోని మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు పండ్లు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా శివకుమార్‌ రెడ్డి ప్రజాసేవలో తనదైన ముద్ర వేయాలని ఆకాంక్షించారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారు కోరారు. భవిష్యత్తులో శివకుమార్‌ రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మమత, బోయరవి, వెంకన్న గౌడ్, కౌన్సిలర్లు బంటు వేణుగోపాల్, సత్యమూర్తి దొరశెట్టి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు తుపాకుల అనిల్, మడపతి శివకుమార్, కిష్టప్ప, ఉదయ్ భాస్కర్, కొమ్ము గోపాల్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments