- సామాజిక మాధ్యమాల్లోని పుకార్లను నమ్మకండి
- జూన్ నుంచి నూతన దరఖాస్తుల స్వీకరణ
- 8వ వార్డ్ కౌన్సిలర్ జావీద్ వెల్లడి…!
జనవాహిని ప్రతినిధి తాండూరు : పెన్షన్ల దరఖాస్తుల గడువు ఈ నెల 25తో ముగుస్తుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ, ప్రభుత్వం నుండి పెన్షన్ల దరఖాస్తుల విషయంలో ఎటువంటి అధికారిక ఆదేశాలు వెలువడలేదని, అటువంటి సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని స్పష్టం చేశారు.జూన్ నెల నుండి కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే అధికారికంగా తెలియజేస్తామని, అంతవరకు ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు వార్డు నంబర్ 8లోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఉన్న తన కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. ఆదివారం రోజంతా కార్యాలయం తెరిచి ఉంటుంది, సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు అందుబాటులో ఉంటామని సూచించారు. దరఖాస్తుదారులు తమతో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఓటర్ ఐడి కార్డ్, రేషన్ కార్డ్ మరియు బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాలని సూచించారు. వేసవి ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కార్యాలయ పనివేళల సమయాల్లోనే వచ్చి దరఖాస్తులను అందజేసి సహకరించాలని ఆయన కోరారు.




