HomeNewsపోలిషింగ్ యూనిట్ కార్మికులపై ‘గుంపు’ దాడి!

పోలిషింగ్ యూనిట్ కార్మికులపై ‘గుంపు’ దాడి!

  •  మహిళా కార్మికుల పట్ల అసభ్య ప్రవర్తన
  •  బెల్ట్ షాప్ నిర్వాహకుడే సూత్రధారి అంటూ బాధితుల ఆరోపణ
  • పోలీస్, ఎక్సైజ్ శాఖలకు ఫిర్యాదు చేసిన యూనిట్ యజమాని

జనవాహిని ప్రతినిధి తాండూరు : యాలాల మండల పరిధిలోని కోకట్ రోడ్డు మార్గంలో ఉన్న ఒక పోలిషింగ్ యూనిట్‌పై కొందరు వ్యక్తులు గుంపుగా వచ్చి, అక్కడ పనిచేస్తున్న కార్మికులపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. బాధితులు మరియు పోలిషింగ్ యూనిట్ యజమాని షేక్ జబీ తెలిపిన వివరాల ప్రకారం… కోకట్ రోడ్డు మార్గంలో షేక్ జబీకి చెందిన పోలిషింగ్ యూనిట్ నడుస్తోంది. ఈ యూనిట్‌లో రోజువారీ పనులు చేసుకుంటున్న లేబర్లపై కొందరు వ్యక్తులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనుక స్థానికంగా ఉన్న ఓ బెల్ట్ షాప్ యజమాని హస్తం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. సదరు బెల్ట్ షాప్ నిర్వాహకుడు కావాలనే తమ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులను రెచ్చగొట్టి, గుంపుగా తీసుకొచ్చి ఈ దాడి చేయించాడని పేర్కొన్నారు. గతంలో కూడా ఇదే విధంగా సదరు యజమాని మనుషులను తీసుకొచ్చి దాడులు చేయించాడని వారు వాపోయారు.కోకట్ రోడ్డు మార్గంలో ఉన్న ఆ బెల్ట్ షాప్ వల్ల స్థానికంగా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని యూనిట్ యజమాని షేక్ జబీ వెల్లడించారు. బెల్ట్ షాప్ పరిసరాల్లో ఉండే వారు, అక్కడి నిర్వాహకులు.. పోలిషింగ్ యూనిట్లలో పనిచేస్తున్న మహిళా కార్మికుల పట్ల నిత్యం అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, దీనిని నిలదీసినందుకే కక్షగట్టి దాడులకు దిగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కార్మికులను వేధిస్తూ, నిరంతరం దాడులకు తెగబడుతున్న సదరు బెల్ట్ షాప్ అక్రమాలపై ఇప్పటికే తాము అబ్కారీ అధికారులకు, అలాగే యాలాల పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా పిర్యాదు చేసినట్లు షేక్ జబీ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని కార్మికులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

📰

ప్రభంజనం • ఈ-పేపర్ డిజిటల్ క్లిప్

ఈ వార్తను వాస్తవిక పత్రికా పేపర్ లేదా సోషల్ మీడియా పోస్టర్‌గా మార్చి షేర్ చేయండి

💬 WhatsApp
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments