HomeNewsపెళ్లి చేసుకుంటానని...!

పెళ్లి చేసుకుంటానని…!

  • ప్రేమ పేరిట మైనర్‌పై అఘాయిత్యం
  • గర్భవతిని చేసిన బంధువు అరెస్ట్
  • తల్లీ పిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు 

తాండూరు, జనవాహిని ప్రతినిధి : ప్రేమ పేరుతో నమ్మించి ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి, ఆమె గర్భం దాల్చడానికి కారణమైన నిందితుడిని తాండూరు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో  మరియు అత్యాచారం కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం… బొమ్రాస్‌పేట్ మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రస్తుతం తాండూరు పట్టణంలో నివాసం ఉంటోంది. ఆమెకు బంధువైన గౌతాపూర్ గ్రామ నివాసి శివకుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో శివకుమార్ సదరు బాలికను ప్రేమిస్తున్నానని, పెద్దలను ఒప్పించి ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆ నమ్మకంతో బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి లోబరుచుకున్నాడు.ఇటీవలే సదరు మైనర్ బాలిక గర్భవతి కావడంతో కుటుంబ సభ్యులు గమనించి ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాను శివకుమార్ చేతిలో మోసపోయానని గ్రహించిన మైనర్ బాలిక తల్లి, ఆదివారం రాత్రి తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్‌లో న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేశారు.బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై తాండూరు పట్టణ పోలీసులు తక్షణమే స్పందించారు. నిందితుడు శివకుమార్‌పై అత్యాచారంతో పాటు బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేశారు.సోమవారం ఉదయం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు.

📰

ప్రభంజనం • ఈ-పేపర్ డిజిటల్ క్లిప్

ఈ వార్తను వాస్తవిక పత్రికా పేపర్ లేదా సోషల్ మీడియా పోస్టర్‌గా మార్చి షేర్ చేయండి

💬 WhatsApp
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments