HomeNewsఅగ్గనూరు శివారులో అక్రమ ఇసుక...! 

అగ్గనూరు శివారులో అక్రమ ఇసుక…! 

spot_img
JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • జుంటుపల్లి వద్ద ట్రాక్టర్ సీజ్య
  • జమానిపై కేసు నమోదు చేసిన యాలాల పోలీసులు

జనవాహిని ప్రతినిధి తాండూరు : యాలల మండల పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. బుధవారం మధ్యాహ్నం అగ్గనూరు గ్రామ శివారు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టర్‌ను యాలాల పోలీసులు పట్టుకున్నారు.అగ్గనూరు శివారు ప్రాంతం నుండి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జుంటుపల్లి సమీపంలో నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఇసుకతో వస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకొని తనిఖీ చేశారు. రవాణాకు సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు.కాగా, సదరు ట్రాక్టర్ అగ్గనూరు గ్రామానికి చెందిన గోపికృష్ణ తండ్రి వెంకటయ్య దిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంటుందని యాలల ఎస్ఐ విట్టల్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు.

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments