HomeNewsఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్న పోలీసులు..!

ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్న పోలీసులు..!

spot_img
JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • అక్రమ ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్న పోలీసులు 
  • అనుమతులు లేకుండా అక్రమ ఇసుక తరలింపు 
  •   ట్రాక్టర్ ను   పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు 

జనవాహిని ప్రతినిధి తాండూరు : పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా సమయం మించి ఇసుకను తరలిస్తుండటంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పట్టుబడిన ట్రాక్టర్‌కు నంబర్ ప్లేట్ కూడా లేకపోవడాన్ని గమనించిన పోలీసులు, వాహనాన్ని స్వాధీనం చేసుకుని పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కాగ్నా నది నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం నుంచే అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని, రోడ్డుపై అతివేగంతో ఇసుక ట్రాక్టర్ లు వెళ్తున్నాయని స్థానికులు ఆరోపించారు. అక్రమ ఇసుక ట్రాక్టర్ పైన కేసు సమాచారం ఇంకా రావాల్సి ఉంది.

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments