HomeNewsఅబద్ధాల దీక్షలు.. బురిడీ మాటలు.. ..!

అబద్ధాల దీక్షలు.. బురిడీ మాటలు.. ..!

spot_img
JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • పదేళ్ల కరెంట్ దోపిడీని రైతులు మర్చిపోలేదు
  • రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్‌దే
  • బిఆర్ఎస్ నాయకులు రాజు గౌడ్ వ్యాఖ్యలపై ఆగ్రహం….
  •  ఆర్కెస్ట్రా నాయకుడు రాజు గౌడ్….
  • 26వ వార్డ్ కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్ విమర్శలు 

జనవాహిని ప్రతినిధి తాండూరు : లక్ష్మీనారాయణపూర్‌లో బిఆర్ఎస్ నిర్వహించిన రైతు దీక్ష ఒక ప్రహసనమని, ఆ పార్టీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడటం ‘వినేవాడు ఉంటే చెప్పేవాడు బిఆర్ఎస్ నాయకుడు’ అన్నట్లుగా ఉందని తాండూరు 26వ వార్డు కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్ ఎద్దేవా చేశారు. మంగళవారం బిఆర్ఎస్ నాయకుడు రాజు గౌడ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గత కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అని చెప్పి రైతులను పదేళ్లపాటు వంచించిందని ఆమె ఆరోపించారు. క్షేత్రస్థాయిలో కరెంట్ ఇవ్వకుండా, కాగితాల్లో మాత్రం 24 గంటల లెక్కలు చూపి మిగిలిన 12 గంటల పైసలను అప్పటి పాలకులు దండుకున్నారని దుయ్యబట్టారు. రైతులకు 6 నుంచి 8 గంటల నాణ్యమైన విద్యుత్ ఉంటే చాలని, దళారీ మాటలు కట్టిపెట్టి వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. బిఆర్ఎస్ హయాంలో రుణమాఫీ అనేది వడ్డీలకే సరిపోయిందని, రైతుల నెత్తిన అప్పు గుదిబండలా అలాగే ఉండిపోయిందని వైశాలి గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు. కేవలం సాంకేతిక కారణాల వల్ల కొందరికి పెండింగ్‌లో ఉందని, త్వరలోనే ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.అనంతరం రాజు గౌడ్‌పై మండిపడుతూ.. మీ రాజకీయ ప్రస్థానంలో మీరు ఎవరి పక్కన ఉంటే వారికి నాశనమేనన్నారు. మీరు ఎవరి మీద చేయి వేస్తే అది భస్మాసుర హస్తంలా మారుతుందన్నారు.  గత 25 ఏళ్ల నుంచి తాండూర్ లో రాజు గౌడ్ ను చూస్తూనే ఉన్నామన్నారు   ఆయన వెయ్యని పార్టీ కండువా లేదన్నారు.   మీ మాయ మాటలు తాండూరు ప్రజలకు, నియోజకవర్గ రైతాంగానికి బాగా తెలుసు అని విమర్శించారు.స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ప్యాకేజీలకు దూరమయ్యామనే అక్కసుతోనే బిఆర్ఎస్ నాయకులు నోరు పారేసుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ ఆఫీసు వైపు గానీ, ఎమ్మెల్యే ఇంటి వైపు గానీ కన్నెత్తి చూసే ధైర్యం రాజు గౌడ్‌కు లేదని సవాలు విసిరారు. బిఆర్ఎస్ ఘోర ఓటమికి కారణమైన వారిలో రాజు గౌడ్ ఒకరని వారి అధిష్టానానికి తెలుసని, ఇప్పటికైనా బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని వైశాలి రాజు గౌడ్ హెచ్చరించారు.

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments