HomeNewsచందూ మహారాజ్ సేవలు చిరస్మరణీయం.!

చందూ మహారాజ్ సేవలు చిరస్మరణీయం.!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • ఘనంగా 33వ వర్ధంతి వేడుకలు
  •  విగ్రహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు 
  • పట్టణ అధ్యక్షులు బతులు నాగు ఆధ్వర్యంలో వర్ధంతి…! 

జనవాహిని ప్రతినిధి తాండూరు : బీసీ ముద్దుబిడ్డ, మాజీ మంత్రి కీర్తిశేషులు ఎం. చంద్రశేఖర్ ముదిరాజ్ (చందూ మహారాజ్) 33వ వర్ధంతి వేడుకలను తాండూరు పట్టణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాతుల నాగు ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్డు మార్గంలోని చందూ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా బాతుల నాగు మాట్లాడుతూ, తాండూరు ప్రాంత అభివృద్ధికి చందూ మహారాజ్ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. మంత్రిగా ఆయన అందించిన సేవలు నేటికీ ప్రజల మనస్సులో సజీవంగా ఉన్నాయని, 33 ఏళ్లు గడిచినప్పటికీ తాండూరు ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు చందూ మహారాజ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments