HomeNewsఅండగా నిలిచిన అనిల్...! 

అండగా నిలిచిన అనిల్…! 

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక సాయం
  • ఎన్నికల హామీని నెరవేరుస్తున్న 6వ వార్డు కౌన్సిలర్
  • వార్డ్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా 
  • కౌన్సిలర్ అనిల్ ఆర్మీ 

జనవాహిని ప్రతినిధి తాండూరు : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, నిత్యం ప్రజల కష్టసుఖాల్లో తోడుంటానని 6వ వార్డు కౌన్సిలర్ అనిల్ మరోసారి నిరూపించుకున్నారు. తన వార్డు పరిధిలోని పేద కుటుంబాల్లో జరుగుతున్న పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందజేసి తన ఉదారతను చాటుకున్నారు.వార్డుకు చెందిన గొల్ల నిరంజన్ కుమార్తె లావణ్య, మరియు బోయ వెంకటేష్ కుమార్తె నందినిల వివాహాలు జరగడం తో , వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తూ ఒక్కొక్కరికి రూ. 5,016 చొప్పున వివాహ కానుకను కౌన్సిలర్ అనిల్ స్వయంగా అందజేశారు.వార్డులో ఏ ఆడబిడ్డ పెళ్లి జరిగినా రూ. 5,016 సహాయం చేస్తానని, అలాగే ఎవరైనా మృతి చెందితే ఆ కుటుంబానికి రూ. 5,000 అంత్యక్రియల నిమిత్తం అందజేస్తానని అనిల్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. పదవిలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఏ చిన్న శుభకార్యం జరిగినా వెళ్లి సాయం అందిస్తుండటం విశేషం.ఈ సందర్భంగా కౌన్సిలర్ అనిల్ మాట్లాడుతూ.. వార్డు ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పేద ప్రజల సేవలో ఎప్పుడూ ముందుంటానని తెలిపారు. తమ కష్టాన్ని గుర్తించి అండగా నిలుస్తున్న కౌన్సిలర్‌కు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments