HomeNewsపార్టీ బలోపేతమే నా లక్ష్యం..!

పార్టీ బలోపేతమే నా లక్ష్యం..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి గజమాల వేసిన బాతుల నాగు 
  • తాండూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం పట్ల హర్షం

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన బాతుల నాగు బుధవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు. తనపై నమ్మకంతో పార్టీ పట్టణ పగ్గాలను అప్పగించినందుకు ఆయన ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.అనంతరం బాతుల నాగు మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానని పేర్కొన్నారు. పట్టణ అధ్యక్షుడిగా తనపై బాధ్యత మరింత పెరిగిందని, పట్టణం లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన బాతుల నాగుకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments