HomeNewsఇళ్ల కేటాయింపులో పైరవీలకు తావులేదు..!

ఇళ్ల కేటాయింపులో పైరవీలకు తావులేదు..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పారదర్శకంగా లక్కీ డ్రా
  •  కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి   కాంగ్రెస్ యువ నాయకులు పట్లోళ్ల  సందీప్ రెడ్డి 

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గంలోని పేదల సొంత ఇంటి కల సాకారం చేసే క్రమంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు అత్యంత పారదర్శకంగా జరుగుతుందని కాంగ్రెస్ పట్టణ యువ నాయకులు పట్లోళ్ల సందీప్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… స్థానిక ఎమ్మెల్యే పర్యవేక్షణలో, జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారుల సమక్షంలో అధికారిక లబ్ధిదారులందరి ముందే డ్రా నిర్వహించబడుతుందన్నారు. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు అని సందీప్ రెడ్డి తెలిపారు.కొందరు కావాలనే ప్రభుత్వంపై, ఎమ్మెల్యే పై బురద చల్లడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బయట వినిపిస్తున్న పుకార్లను ఎవరూ నమ్మవద్దని, అర్హులైన పేదలకు న్యాయం చేయడమే మా లక్ష్యంమన్నారు. ఈ ప్రక్రియలో ఏదైనా తప్పు జరిగితే చూస్తూ ఊరుకోం అని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి బాధ్యత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీసుకున్నారని, ఎక్కడా పైరవీలకు, అక్రమాలకు తావులేకుండా అర్హులకు ఇళ్లు అందేలా చూస్తామని సందీప్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments