HomeNewsరోహిత్ రెడ్డికి అండగా ఉంటాం...! 

రోహిత్ రెడ్డికి అండగా ఉంటాం…! 

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • మాజీ ఎమ్మెల్యేను కలిసిన 32వ వార్డు కౌన్సిలర్ కుటుంబం
  • రాబోయే రోజుల్లో మళ్లీ ఎమ్మెల్యే ఆయనేనని ధీమా
  • 32వ వార్డ్ కౌన్సిలర్ మహేశ్వరీ 

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి మున్సిపల్ పరిధిలోని 32వ వార్డు కౌన్సిలర్ మహేశ్వరి తన కుటుంబ సభ్యులతో కలిసి రోహిత్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. అక్రమ కేసులో 45 రోజుల రిమాండ్ అనంతరం బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన రోహిత్ రెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కౌన్సిలర్ కుటుంబం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు రోహిత్ రెడ్డికి ధైర్యాన్ని నూరిపోస్తూ, పార్టీ శ్రేణులంతా ఆయన వెంటే ఉన్నారని భరోసానిచ్చారు. రాజకీయ కుట్రలతోనే అక్రమ కేసులు పెట్టారని, రాబోయే ఎన్నికల్లో రోహిత్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. రోహిత్ రెడ్డిని కలిసిన వారిలో కౌన్సిలర్ మహేశ్వరితో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరుడు రాజు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments