HomeNewsఉర్దూఘర్ ప్రహరీ గోడకు నిధులు....!

ఉర్దూఘర్ ప్రహరీ గోడకు నిధులు….!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • ఉర్దూఘర్ ప్రహరీ గోడకు రూ. 10 లక్షల నిధులు
  • ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవపై చైర్మన్ జలాల్ హర్షం

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని ఉర్దూఘర్ ప్రహరీ గోడ నిర్మాణానికి పది లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ నిధులను కేటాయించడం పట్ల ఉర్దూఘర్ చైర్మన్ జలాల్ ఘనంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా జలాల్ మాట్లాడుతూ.. పట్టణంలోని మైనారిటీల అవసరాలను గుర్తించి, ఉర్దూఘర్ అభివృద్ధికి ఎమ్మెల్యే నిధులు కేటాయించడం శుభపరిణామమని పేర్కొన్నారు. గత కొంతకాలంగా ప్రహరీ గోడ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈ నిధులతో రక్షణ గోడ నిర్మాణం పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.”మైనారిటీల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ, వారికి అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సమాజం తరపున ఎల్లప్పుడూ తోడుగా ఉంటాం” అని జలాల్ స్పష్టం చేశారు.  ఉర్దూఘర్ కేవలం మైనారిటీ వాళ్లకే కాదు… పేద వారికీ అందరికి కులమత బేధాలు లేకుండా అందరు ఉపయోగించుకోవాలని చైర్మన్ జాలాల్ పేర్కొన్నారు.   అభివృద్ధి పనుల పట్ల ఎమ్మెల్యే చూపుతున్న నిబద్ధతను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.  ఉర్దూఘర్ అభివృద్ధి కు నిధులు మంజూరు చేసిన సందర్బంగా   ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు    నిధుల మంజూరు పట్ల స్థానిక మైనారిటీ నాయకులు, ఉర్దూఘర్ కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments