HomeNewsజర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇప్పిస్తాం..!

జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇప్పిస్తాం..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  •  కమిటీ సభ్యులు శెట్టి రవిశంకర్ వెల్లడి
  •  మే 10 నుంచి ప్రారంభం కానున్న ప్రక్రియ
  •  కలెక్టర్ దీపక్ తివారీతో ముగిసిన చర్చలు

జనవాహిని ప్రతినిధి తాండూరు : జిల్లాలోని అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం నుండి అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయించడమే తమ లక్ష్యమని అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు శెట్టి రవిశంకర్ పేర్కొన్నారు. అక్రిడిటేషన్ కార్డు సాధన ప్రతి జర్నలిస్టు హక్కు అని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ, జర్నలిస్టుల కార్డుల జారీ విషయమై జిల్లా కలెక్టర్ దీపక్ తివారీతో ఇప్పటికే రెండుసార్లు సమావేశమైనట్లు తెలిపారు. ఈ భేటీలో జిల్లాలోని అన్ని పత్రికల విలేకర్ల జాబితా మరియు అర్హతలపై సమగ్రంగా చర్చించినట్లు వివరించారు. మే 10వ తేదీ నాటికి కొత్త కార్డుల మంజూరు ప్రక్రియను అధికారికంగా మొదలుపెడతామని కమిటీ సభ్యులు ధీమా వ్యక్తం చేశారు.క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులతో పాటు, సుదీర్ఘ అనుభవం ఉన్న వెటరన్ జర్నలిస్టులకు మరియు ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు కూడా ఈసారి అక్రిడిటేషన్ కార్డులు అందేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు రవిశంకర్ తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అర్హులైన వారందరూ ఈ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments