HomeNewsఆడబిడ్డకు పెద్దన్నగా....!

ఆడబిడ్డకు పెద్దన్నగా….!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • తాండూరు మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ దాతృత్వం
  •  ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం 
  •  కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు  

జనవాహిని ప్రతినిధి తాండూరు : రాజకీయాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం అరుదుగా చూస్తుంటాం. కానీ తాండూరు మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ బిఆర్ఎస్ అనిల్ ఆర్మీ మాత్రం తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకొని వార్డు ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం, వార్డులోని ఒక ఆడబిడ్డ పెళ్లికి తన వంతు ఆర్థిక సాయం అందించి పెద్దన్నగా నిలిచారు.వార్డుకు చెందిన కనకప్ప రెండో కుమార్తె రాధికా వివాహం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా గురువారం కౌన్సిలర్ అనిల్ సదరు కుటుంబ సభ్యులను కలిశారు. ఎన్నికల వాగ్దానం మేరకు రూ. 5,016/- నగదును వారికి అందజేశారు. వార్డులో ఎవరి ఇంట్లో పెళ్లి జరిగినా లేదా ఎవరైనా మరణించినా ఆర్థికంగా ఆదుకుంటానని ఆయన గతంలో ప్రకటించారు. ఆ హామీని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు.ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కష్టసుఖాల్లో తోడుండటమే తన లక్ష్యమని అన్నారు. ఆపదలో ఉన్న పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కౌన్సిలర్ దాతృత్వానికి కనకప్ప కుటుంబ సభ్యులతో పాటు వార్డు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments