HomeNewsజిల్లా టాపర్‌గా కృష్ణవేణి విద్యార్థి...!

జిల్లా టాపర్‌గా కృష్ణవేణి విద్యార్థి…!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • 600కు 592 మార్కులతో జిల్లా టాపర్‌గా జి. సాయి వినీత్
  • వంద శాతం ఉత్తీర్ణతతో విద్యాసంస్థ రికార్డు
  • హర్షం వ్యక్తం చేసిన పాఠశాల యాజమాన్యం

జనవాహిని ప్రతినిధి తాండూరు : పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో తాండూరులోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పట్టణ కీర్తిని చాటారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఈ పాఠశాల విద్యార్థులు భారీ మార్కులతో ఉత్తీర్ణులై విద్యా రంగంలో తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు.పాఠశాలకు చెందిన జి. సాయి వినీత్ అనే విద్యార్థి 600 మార్కులకు గాను 592 మార్కులు సాధించి తాండూరు పట్టణ మరియు జిల్లా టాపర్‌గా నిలిచాడు. ఇతనితో పాటు సి. సౌమ్యశ్రీ (589), డి. సాన్వి (589), విభావరి బాలాజీ పింప్లే (587), సి. శ్రీనిత ప్రియ (582), ఎం. భవాని (580) అత్యుత్తమ మార్కులతో తమ ప్రతిభను చాటారు. అదేవిధంగా బి. ఆకాంక్ష (578), అబ్దుల్ రెహమాన్ (577), శ్రీ సింగ్ ఠాకూర్ (573), మెట్లి పూజ (573), పి. వైష్ణవి (571) లు మెరుగైన స్కోరును నమోదు చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులందరూ ఉత్తీర్ణులై 100% ఫలితాన్ని సాధించారు. పాఠశాల నుంచి 50 మంది విద్యార్థులు 500 కంటే ఎక్కువ మార్కులు సాధించి రికార్డు సృష్టించారు.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మరియు హెచ్.ఎం మాట్లాడుతూ.. విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణ, అంకితభావం వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైందని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయడంలో కృష్ణవేణి సంస్థ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. టాపర్లుగా నిలిచిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం ఘనంగా అభినందించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments