HomeNewsమార్కుల పంట పండించిన ‘అక్షర’ విద్యార్థులు!

మార్కుల పంట పండించిన ‘అక్షర’ విద్యార్థులు!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • పదో తరగతి ఫలితాల్లో ‘అక్షర’ ప్రభంజనం
  •  581 మార్కులతో శ్రీనిధి టాపర్
  • అత్యుత్తమ ఫలితాలు సాధించిన అక్షర కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు
  •  హర్షం వ్యక్తం చేసిన పాఠశాల యాజమాన్యం

జనవాహిని ప్రతినిధి తాండూరు :  పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ సందర్భంగా పదో తరగతి వార్షిక పరీక్షా ఫలితాల్లో తాండూరు పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రభంజనం సృష్టించారు. పాఠశాలకు చెందిన కుమారి శ్రీనిధి 581 మార్కులు సాధించి పాఠశాల టాపర్‌గా నిలిచింది. అలాగే కుమారి అదితి 573, పి. దీక్షిత రెడ్డి 552, సంజన వైష్ణవ్ 526, అంకిత 524, శ్రీ వైష్ణవి 522, మరియు రాజమల్ల రెడ్డి 506 మార్కులతో అత్యుత్తమ ఫలితాలు సాధించి సత్తా చాటారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మోహన్ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల నిరంతర కృషి వల్లే ఈ అద్భుత విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. తమ పాఠశాలలో కేవలం చదువుకే కాకుండా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసే విధంగా బోధన ఉంటుందని పేర్కొన్నారు. టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.సైన్స్ ఉపాధ్యాయులు శ్రీకాంత్ మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, వారిలో ఒత్తిడి లేకుండా ప్రణాళికాబద్ధంగా చదివించడం వల్లే ఇంతటి భారీ మార్కులు వచ్చాయని అన్నారు. ముఖ్యంగా సైన్స్ సబ్జెక్టులో విద్యార్థులు కనబరిచిన ప్రతిభ ముదావహమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments