HomeNewsలక్ష్యంతో చదివి.. విజేతలుగా నిలవాలి..!

లక్ష్యంతో చదివి.. విజేతలుగా నిలవాలి..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • అంకితభావంతో చదివి లక్ష్యాన్ని ముద్దాడాలి
  •  ఆర్ బి ఓ ఎల్   ఎండీ బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి
  •  ముగిసిన 40 రోజుల ఉచిత ఎంసెట్  శిక్షణ తరగతులు
  • ఘనంగా ఇంటర్ టాపర్ల సన్మానం

జనవాహిని ప్రతినిధి తాండూరు : విద్యార్థినులు నిర్దిష్టమైన ప్రణాళిక, అంకితభావంతో చదివి పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలవాలని ఆర్బిఓఎల్ మేనేజింగ్ డైరెక్టర్ బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సిద్ధార్థ జూనియర్ కళాశాలలో హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో గత 40 రోజులుగా నిర్వహించిన బాలికల ఉచిత ఎంసెట్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థినులు గురువుల మార్గదర్శనంలో విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. “నిరంతర అభ్యాసమే మనిషిని పరిపూర్ణుడిగా మారుస్తుంది. విద్యార్థినులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి” అని ఆకాంక్షించారు. గత ఏడాది కూడా హిందూ ధార్మిక పరిషత్ అందించిన శిక్షణతో ఎంతోమంది విద్యార్థినులు రాష్ట్రస్థాయిలోని టాప్ కళాశాలల్లో సీట్లు సాధించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె తెలిపారు.కార్యక్రమంలో భాగంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తాండూరు స్థాయిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థినులను, వారి తల్లిదండ్రులను సరళ శ్రీనివాస్ రెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం శిక్షణ విజయవంతం కావడానికి కృషి చేసిన అధ్యాపకులకు, ధార్మిక పరిషత్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక పరిషత్ కన్వీనర్ గాజుల బస్వరాజ్, ఉపాధ్యాయురాలు ఉమాదేవి, తాండూరు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నరేందర్, ఎంసెట్ కోచింగ్ కన్వీనర్ పర్యాద రామకృష్ణ, కౌన్సిలర్లు బంటు వేణు గోపాల్, అల్లాపూర్ శ్రీకాంత్, యువ నాయకులు బాతుల నాగు, సభ్యులు ఓం ప్రకాష్ సోమాని, వినోద్ జైన్, పటేల్ విజయ్ కుమార్, అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments