HomeNewsవార్డ్ పై స్పెషల్ ఫోకస్...!

వార్డ్ పై స్పెషల్ ఫోకస్…!

  • 6వ వార్డు అభివృద్ధికి వినతి.. 
  • వెంటనే రెండు బోర్లు మంజూరు
  • పార్కు అభివృద్ధికి అధికారుల సానుకూల స్పందన.
  • అధికారులకు వినతిపత్రం అందజేసిన కౌన్సిలర్ అనిల్.

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు సమస్యల పరిష్కారానికి కౌన్సిలర్ అనిల్ చొరవ చూపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డిలను కలిసి వార్డులోని పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ అనిల్ మాట్లాడుతూ.. వార్డులో ప్రధానంగా తాగునీటి ఎద్దడి నెలకొందని, తక్షణమే కొత్త బోర్లు వేయించి నీటి సమస్యను తీర్చాలని వారిని కోరారు. అదేవిధంగా వార్డులోని అంతర్గత రోడ్ల నిర్మాణం, సీసీ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, వార్డులో ఉన్న పార్కును ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా అభివృద్ధి చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.కౌన్సిలర్ విన్నపానికి ఛైర్పర్సన్, కమిషనర్లు సానుకూలంగా స్పందించారు. వార్డులో తాగునీటి సమస్య పరిష్కారానికి గాను వెంటనే రెండు కొత్త బోర్లు వేయించేందుకు వారు అంగీకారం తెలిపారు. నిధుల లభ్యతను బట్టి వార్డులో చేపట్టాల్సిన రోడ్లు, డ్రైనేజీ పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని, పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments