HomeNewsట్యాంకర్లతో తాగునీరు...!

ట్యాంకర్లతో తాగునీరు…!

  •  6వ వార్డులో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
  •  ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలిచిన కౌన్సిలర్ 
  •  అధికారులతో చర్చించి శాశ్వత పరిష్కారానికి హామీ

జనవాహిని ప్రతినిధి తాండూరు : గత కొద్ది రోజులుగా తాండూరు పట్టణం లో నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. దింతో సోమవారం మున్సిపల్ పరిధిలోని 6వ వార్డ్ లో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ప్రజల గోడును తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ అనిల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. యుద్ధప్రాతిపదికన వాటర్ ట్యాంకర్లను తెప్పించి, వార్డులోని ప్రతి గల్లీలో ప్రజలకు నీటిని పంపిణీ చేయించారు. తమ సమస్యను గుర్తించి వెంటనే స్పందించిన కౌన్సిలర్ అనిల్ కు వార్డు మహిళలు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కేవలం తాత్కాలిక ఉపశమనంతో ఆగకుండా, భవిష్యత్తులో ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండాలని అనిల్ సంబంధిత అధికారులతో, పైప్‌లైన్ల మరమ్మతులు, ఇతర సాంకేతిక సమస్యలపై చర్చించి, త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments