- భక్తిశ్రద్ధలతో రామమందిర పునర్నిర్మాణం
- దాతల విరాళాలు
- కృతజ్ఞతలు తెలిపిన ఆలయ కమిటీ
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని ఇందిరా నగర్‌లో వెలసిన ఏకైక శ్రీ రామ మందిర పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ పవిత్ర కార్యంలో భాగస్వాములు కావాలనే సంకల్పంతో పలువురు దాతలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు.ఆలయ పునర్నిర్మాణానికి గాను సోమవారం పలువురు ప్రముఖులు ఆలయ కమిటీకి విరాళాలను సమర్పించారు. ఈ సందర్బంగా పట్లోళ్ల దీపా నరసింహులు ఆలయ నిర్మాణానికి తన వంతుగా రూ. 1,00,000/ లక్ష రూపాయలు విరాళాన్ని అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. శెట్టి రమేష్ రూ. 21,000/- నగదును కమిటీకి అందజేశారు.లింగదలి రవికుమార్: రూ. 11,000/- ఆర్థిక సాయం ప్రకటించారు. తట్టెపల్లి ప్రభు శంకర్: రూ. 5,000/- విరాళంగా ఇచ్చారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. భక్తుల సహకారంతోనే ఆలయ నిర్మాణం సాధ్యమవుతుందని, ఇందిరా నగర్ లోని ఈ ఏకైక రామ మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. విరాళాలు అందజేసిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరికొందరు దాతలు కూడా ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి తోడ్పడాలని వారు కోరారు.



