గల్లీ గల్లీలో గులాల్ జల్లు...!

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)
  • తాండూరు 'కలర్ ఫుల్' ధమాకా...!
  • రంగుల వానలో తడిసిముద్దైన పట్టణం!

జనవాహిని ప్రతినిధి తాండూరు :    ఏ రంగు చూసినా ఆనందమే.. ఏ వీధికి వెళ్లినా కేరింతలే! తాండూరు పట్టణం సోమవారం నాడు రంగుల లోకాన్ని తలపించింది. నూతన కౌన్సిలర్ల హంగామా, నాయకుల సందడితో పట్టణమంతా ఒక్కటే రంగు.. అది సంతోషపు రంగు.  తాండూరు గల్లీల్లో రంగుల జాతర మొదలైంది! హోలీ పండగ అంటేనే ఉత్సాహం.. ఆ ఉత్సాహానికి తాండూరు ప్రజల జోష్ తోడైతే ఇక ఆగుతుందా? పట్టణం మొత్తం రంగుల లోకమైపోయింది. ఎటు చూసినా ఎరుపు, పసుపు, గులాబీ రంగుల సందడే!ఈసారి హోలీలో అసలైన స్పెషల్ అట్రాక్షన్ మన నూతన కౌన్సిలర్లు, నాయకులు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ 'దోస్తీ' రంగును పులుముకున్నారు. నాయకులంతా సామాన్యులతో కలిసి స్టెప్పులేయడం విశేషం.తాండూరు మార్కెట్ ఏరియాతో పాటు పలు చోట్ల ఏర్పాటు చేసిన 'హుట్టి కొట్టే' కార్యక్రమం ఒక రేంజ్‌లో సాగింది. యువత కేరింతలు, డప్పు చప్పుళ్లతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది.చిన్నారులు తమ పిచికారీలతో 'గ్యాంగ్స్'గా విడిపోయి వీధుల్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అడ్డొచ్చిన వాళ్లందరినీ రంగులతో ముంచెత్తి బురా న మానో హోలీ హై అంటూ సందడి చేశారు.మొత్తానికి తాండూరు హోలీ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఆ రంగుల వెనుక ఉన్న స్నేహం, ఆ పండగ వెనుక ఉన్న సంతోషం పట్టణ ప్రజల మొహాల్లో స్పష్టంగా కనిపించాయి.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *