HomeNewsఅభివృద్ధి పథంలో దూసుకుపోవాలి..!

అభివృద్ధి పథంలో దూసుకుపోవాలి..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • మున్సిపల్ కౌన్సిలర్లకు ముదిరాజ్ సంఘం సన్మానం…! 
  • కౌన్సిలర్లకు ముదిరాజ్ యువజన కమిటీ అభినందనలు
  • ప్రజా సేవలో మీరు మరిన్ని శిఖరాలు అధిరోహించాలి

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ కౌన్సిలర్లుగా ఎన్నికైన బంటు వేణు, అల్లాపూర్ శ్రీకాంత్, మరియు కిరణ్ ముదిరాజ్ లకు తాండూరు ముదిరాజ్ యువజన కమిటీ నియోజకవర్గ అధ్యక్షులు ఎస్పీ రవికాంత్ ఆధ్వర్యంలో ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. ఆదివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు లొంక నర్సింలు,నియోజకవర్గ ముదిరాజ్ కమిటీ, పట్టణ కమిటీ సభ్యులు కౌన్సిలర్లను సన్మానించి, వారి భవిష్యత్తు మరిన్ని విజయాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ముదిరాజ్ నియోజకవర్గ మరియు పట్టణ యువజన కమిటీ నాయకులు మాట్లాడుతూ.. వార్డుల అభివృద్ధిలో నూతన కౌన్సిలర్లు కీలక పాత్ర పోషించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం సేవ చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో యువత తరపున పూర్తి మద్దతు ఉంటుందని వారు పేర్కొన్నారు.కౌన్సిలర్లుగా బాధ్యతలు చేపట్టిన ముగ్గురు నాయకులు కూడా తమపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, పట్టణ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, యువజన కమిటీ సభ్యులు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments