HomeNewsఅభివృద్ధి బాటలో తాండూరు...!

అభివృద్ధి బాటలో తాండూరు…!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • తాండూరు అభివృద్ధికి రూ. 23.47 కోట్ల నిధులు మంజూరు
  •   287 అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం
  •  ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి చొరవతో నిధుల కేటాయింపు
  •  హర్షం వ్యక్తం చేసిన టీపీసీసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ కరణం పురుషోత్తం రావు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసింది. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద సుమారు రూ. 23 కోట్ల 47 లక్షల నిధులను కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ కరణం పురుషోత్తం రావు ఒక ప్రకటనలో తెలిపారుస్థానిక శాసనసభ్యులు బి. మనోహర్ రెడ్డి ప్రత్యేక కృషితో నియోజకవర్గంలోని తాండూరు, పెద్దేముల్, యాలాల్, బషీరాబాద్ మరియు కోటపల్లి మండలాల్లో మొత్తం 287 పనులను చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ఈ నిధులతో గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న కీలక సమస్యలు పరిష్కారం కానున్నాయని పేర్కొన్నారు.గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, స్వయం సహాయక సంఘాల భవనాల నిర్మాణం.పాఠశాలలకు కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్ల ఏర్పాటు.ధాన్యపు నిల్వ కేంద్రాలు, వర్క్ షెడ్ల నిర్మాణం.గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు, మురుగు కాలువల ఏర్పాటు.డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాల్లో మౌలిక వసతుల కల్పన లాంటి, మంజూరైన పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని పురుషోత్తం రావు అధికారులను కోరారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం, స్థానిక సర్పంచులు మరియు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఈ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించాలని పిలుపునిచ్చారు. భారీగా నిధులు కేటాయించినందుకు గాను ముఖ్యమంత్రికి, మంత్రులకు మరియు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments